Header Banner

జనావాసాలపై కూలిన విమానం.. అమెరికాలో భారీ విధ్వంసం..! డజను కార్లు బూడిద..!

  Fri May 23, 2025 12:08        U S A

అమెరికాలో గురువారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో ఓ చిన్న విమానం అదుపుతప్పి జనావాసాలపై పడింది. దీంతో మంటలు ఎగిసిపడి 15 ఇళ్లు, పదుల సంఖ్యలో కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు. నగర శివార్లలోని స్కల్పిన్ స్ట్రీట్, శాంటో రోడ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ప్రజలెవరూ అటువైపు రాకుండా హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదానికి గురైన విమానం సెస్నా రకానికి చెందినదిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఇద్దరు మరణించారని, జనావాసాలపై విమానం కూలినందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయని శాన్ డియాగో అగ్నిమాపక శాఖ సహాయ ప్రధాన అధికారి ఏబీసీ న్యూస్‌కు తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!


ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!


ఆ ఉద్యోగులకు శుభవార్త ! ప్రభుత్వం వాటికి గ్రీన్ సిగ్నల్!


దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..! ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్!


అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ పై బిగ్ అప్డేట్! కలిసొచ్చేదెవరికి..!


అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!


తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!


సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #USPlaneCrash #AviationAccident #BreakingNews #PlaneCrashUSA #MassiveDestruction #ResidentialCrash